Homeజిల్లా వార్తలునాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది: ఎక్సైజ్ సూపర్డెంట్ పంచాక్షరి

నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది: ఎక్సైజ్ సూపర్డెంట్ పంచాక్షరి

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో గీత కార్మిక సంఘం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మిక సంఘం రెండు ఎకరాల స్థలంలో ఈజీఎస్ నిధుల నుండి 2 వేల ఈత మొక్కలు నాటి కార్యక్రమానికి ఎక్సైజ్ సూపర్డెంట్ పంచాక్షరి, సీఐ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఎక్సైజ్ అధికారులు మండల ప్రజా ప్రతినిధులు అధికారులు గౌడ సంఘ సభ్యులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈత మొక్కలను సంరక్షించుకొని నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని గౌడలకు ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులను గౌడ సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ సంఘ సభ్యులు కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సూపర్డెంట్ పంచాక్షరి, సిఐ శ్రీనివాస్ గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి గుండెల్ని శ్రీనివాస్, రాజారాం, యాదగిరి, బాలయ్య, ఎల్లయ్య, గంగయ్య, ఆంజనేయులు, దేవేందర్, బాలసాని, శ్రీనివాస్, ఈజీఎస్ అధికారులు పంచాయతీ కార్యదర్శి రమేష్ గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img