Homeహైదరాబాద్latest Newsఆ పెద్ద హీరో రాత్రి 12 గంటలకు తన తలుపు తట్టేవాడు.. హీరోయిన్ మల్లికా షెరావత్...

ఆ పెద్ద హీరో రాత్రి 12 గంటలకు తన తలుపు తట్టేవాడు.. హీరోయిన్ మల్లికా షెరావత్ సంచలన వ్యాఖ్యలు.

మల్లికా షెరావత్ ప్రస్తుతం తన తదుపరి బాలీవుడ్ విడుదల ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మల్లికా షెరావత్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. ‘సూపర్‌హిట్’ కామెడీ షూటింగ్ సమయంలో ‘పెద్ద’ హీరో వేధించాడని నటి గుర్తుచేసుకుంది. మల్లికా షెరావత్ మాట్లాడుతూ.. ఆ సమయంలో నేను దుబాయ్‌లో ఓ పెద్ద సినిమా షూటింగ్‌లో ఉన్నాను. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రేక్షకులకు నచ్చింది. ఆ సినిమాలో నాతో నటించిన ఓ హీరో నన్ను వేధించాడు. మేము ఉంటున్న హోటల్ లో రోజు అతను రాత్రి 12 గంటలకు నా గది తలుపు తట్టేవాడు. తలుపు తీయ్యకపోతే డోర్ పగలగొట్టి నా బెడ్ రూంలోకి వస్తానంటూ బెదిరించేవాడు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అన్నారు. ఈ సంఘటన నన్ను చాలా భయపెట్టింది. నువ్వు ఎంత ప్రయత్నించినా నేను తలుపు తీయను. నువ్వు అనుకున్నది జరగదు అంటూ ఆ హీరోకి వార్నింగ్ ఇచ్చాను అని మల్లికా షరావత్ తెలిపింది. అప్పటి నుంచి అతనితో కలిసి పనిచేయలేదని మల్లికా షెరావత్ చెప్పింది.

Recent

- Advertisment -spot_img