Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (09-10-2024, బుధవారం)

నేటి రాశి ఫలాలు (09-10-2024, బుధవారం)

మేషం

వృత్తిలో రాణిస్తారు. సమాజంలో గౌరవం, ఆదాయం పెరుగుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నవి పూర్తి చేయండి. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. అధికారుల మన్ననలు అందుకుంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అనవసరమైన వివాదాలు ముందుకు వస్తాయి. సంయమనంతో ఉండటం అవసరం. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. సూర్యారాధన శుభప్రదం.

వృషభం

వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు అధికారులు ఆదరణ పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. గృహ నిర్మాణం, భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. కార్యసాఫల్యం ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం. శివాలయాన్ని సందర్శించండి.

మిథునం

ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. భక్తి పెరుగుతుంది. కొన్ని పనులు అతికష్టం మీద పూర్తవుతాయి. పట్టుదలతో ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులు పై అధికారులతో, తోటివారితో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలుచేస్తుంది.

క‌ర్కాట‌కం

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈరోజు తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. అధికారుల స్నేహంతో మంచిపేరు సంపాదిస్తారు. సహోద్యోగులతో పనులు నెరవేరుతాయి. రావలసిన డబ్బు సమయానికి అందకపోవచ్చు. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసులు, రాజకీయ, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా పఠించండి.

సింహం

నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. పాతబాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. సంయమనంతో పనులు చేయడం అవసరం. రాజకీయ నాయకుల అండ దండలు లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోండి.

కన్య

కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలి తాలు ఉంటాయి. శ్రమ అధికం అయినప్పటికీ చేపట్టిన పనులు నెరవేరుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. సంయమనంతో వ్యవహరించండి. విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంటారు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.

తుల

పాతబాకీలు వసూలు అవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. భూముల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. అనాలోచిత నిర్ణయాల వల్ల పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రామాలయాన్ని సందర్శించండి.

వృశ్చికం

ఆర్థిక సమస్యలు నిదానంగా తొలగిపోతాయి. రాబడి పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు చేస్తారు. వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి. నూతన గృహనిర్మాణం చేపడతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. తోటివారితో అభిప్రాయభేదాలు రావచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇష్టదేవతార్చన చేసుకోండి.

ధనుస్సు

అధికారులు ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. పదోన్నతి కారణంగా స్థానచలనం ఉంటుంది. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. ఖర్చులు పెరగవచ్చు. భూమి కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తవు తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

మకరం

కళాకారులకు మంచికాలం. పెద్దల సహకారం లభిస్తుంది.. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులు శ్రమించాల్సి రావచ్చు. ఉద్యోగులు పట్టుదలతో పనులు చేస్తారు. ప్రభుత్వ, రాజ కీయ పనుల్లో జాప్యం జరుగుతుంది. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట్లోకి కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో చిన్నపాటి అభిప్రాయభేదాలు రావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.

కుంభం

నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వాళ్ళు ఈరోజు గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. తొందర పాటు నిర్ణయాలతో పనులలో జాప్యం ఉండవచ్చు. భక్తి పెరుగు తుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చదువులో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు కేసులు, రాజకీయ, ప్రభుత్వ పనులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలలోకి వెళ్లకుండా సంయమనంతో పనులు పూర్తి చేస్తారు. శివాలయాన్ని సందర్శించండి.

మీనం

ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అన్ని విధాలుగా ఆలో చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ, పనులు నెరవేర్చుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి తగాదాలు కొంత పరిష్కారం అవుతాయి. నరసింహ స్వామి ఆరాధన మేలుచేస్తుంది.

Recent

- Advertisment -spot_img