నేడు టీ20ల సిరీస్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ రెండో టీ20లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగగా.. టీమిండియా జట్టు మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
టీమిండియా జట్టులో సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్ ఉన్నారు.
బంగ్లాదేశ్ జట్టులో పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో ( కెప్టెన్), తౌహీది హర్దోయ్, మహమ్మదుల్లా, జాకీర్ అలీ, మెహదీ హాసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్ సాకీబ్, ముస్తఫిజూర్ రెహమాన్ ఉన్నారు.