హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాల రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ వేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు నమోదు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.ఇటీవలి కాలంలో ప్రభుత్వం కొత్త గ్రామాలను హెచ్‌ఎండీఏ పరిధిలోకి చేర్చింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో ఇప్పటికే అనేక ఫాంహౌస్‌లకు గ్రామ పంచాయతీలు అనుమతులు ఇచ్చాయి. జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ చిప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కు గ్రామపంచాయతీ అనుమతి ఇచ్చింది. హైడ్రా ఆవిర్భావంతో గ్రామ పంచాయతీల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.