Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (17-10-2024, గురువారం)

నేటి రాశి ఫలాలు (17-10-2024, గురువారం)

మేషం
ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. వృత్తిలో హోదా పెరుగుతుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అయితే, ఖర్చుల నియంత్రణ అవసరం. రాజకీయ పనుల్లో కదలిక ఉంటుంది. కోర్టు తీర్పులు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

వృషభం
కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. గతంలో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభిస్తారు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు మంచి సమయం. ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగులతో సామరస్యంగా వ్యవహరిస్తారు. భూ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన మరమ్మతులు ముందుకు రావచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. రామాలయాన్ని సందర్శించండి.

మిథునం
స్నేహితులు, ఆత్మీయులను కలుసుకుంటారు. నలుగురిలో పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రయాణాలు సంతృప్తిగా, లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. భూ లావాదేవీలు కలిసివస్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. విందులకు హాజరవుతారు. శివారాధన మేలుచేస్తుంది.

కర్కాటకం
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో అందరి ప్రోత్సాహం లభిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి. కోర్టు కేసులలో అనుకూల తీర్పు ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలం. అధికారుల ఆదరణ, పనితనానికి గుర్తింపు లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నరసింహస్వామి. ఆరాధన శుభప్రదం.

సింహం
ఆరోగ్యం మెరుగవుతుంది. ఉల్లాసంతో పనులు చేస్తారు. పదోన్నతి, స్థానచలన సూచన. రాజకీయ, ప్రభుత్వ పనులు నెర వేరుతాయి. న్యాయ సమస్యలు తీరుతాయి. తాత్కాలిక వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి. దీర్ఘకాలిక పనులలో ఆటంకాలు రావచ్చు. అన్నదమ్ములు, బంధువర్గంతో ఆప్యాయంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం లభిస్తుంది. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

కన్య
వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం, మరమ్మతుల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. భూ తగాదాలు ముందుకు రావచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. సూర్యారాధన మేలుచేస్తుంది.

తుల
మంచి అవకాశాలు వస్తాయి. సమయస్ఫూర్తితో స్పందించండి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. శారీరక శ్రమ పెరగవచ్చు. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ఓపికతో పనులను పూర్తిచేయాల్సి వస్తుంది. వ్యాపారం పురోగతి సాధిస్తుంది. లావాదేవీలు లాభదాయకంగా కొనసాగుతాయి. కోర్టు సమస్యలు తీరుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించండి.

వృశ్చికం
శుభకార్యాలు చేస్తారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా బంధువర్గం, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. పనులపై శ్రద్ధ నిలుపుతారు. నలుగురికి సాయ పడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. న్యాయపరమైన ఆటంకాలను అధిగమిస్తారు. సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంతో ఉంటారు. ఇష్టదేవతార్చన చేసుకోండి.

ధనుస్సు
ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలకు స్నేహి తుల సహకారం లభిస్తుంది. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. వృథా ఖర్చులు ఉండవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలసట లేకుండా పనులు చేస్తారు. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. భూ వ్యవహారాలు లాభిస్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. రోజు వారీ వ్యాపారం సజావుగా సాగుతుంది. లలితాదేవి స్తోత్రాలు పఠించండి.

మకరం
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వాళ్ళు ఈరోజు కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. చాలాకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పనిభారం పెరగడంతో కొంత అలసటకు గురవుతారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. వివాదాలు రాకుండా చూసుకోవడం మంచిది. భూ లావాదేవీల్లో కాలయాపన ఉంటుంది. దాయాదులతో మాటపట్టింపులు ఉండవచ్చు. రాఘవేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించండి.

కుంభం
వివాహాది శుభకార్యాలు చేస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. పనిత నానికి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. ప్రయా ణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులు, అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. భూమి కొనుగోలు చేస్తారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శివారాధన మేలుచేస్తుంది.

మీనం
అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సమాజంలో హుందాగా వ్యవహరిస్తారు. ఆత్మీయులు, అనుభవజ్ఞుల సహకారంతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సాహిత్య సభలకు హాజరవుతారు. సమాజంలో మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. మీ ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

Recent

- Advertisment -spot_img