Homeహైదరాబాద్latest Newsబాలీవుడ్‌ పీఆర్ ఏజెన్సీలపై.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్‌ పీఆర్ ఏజెన్సీలపై.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు

హీరోయిన్ సాయి పల్లవి ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో తాజాగా తమిళ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా, సాయి పల్లవి హీరోయినిగా నటించిన సినిమా ‘అమరన్’. ఈ సినిమా ప్రమోషన్స్ ముంబై వెళ్లిన సాయి పల్లవి.. ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ పీఆర్ ఏజెన్సీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత కొంతకాలం క్రితం బాలీవుడ్‌కి చెందిన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు… నన్ను ప్రమోట్ చేయడానికి మరియు తరచుగా వార్తల్లో ఉండటానికి పీఆర్‌ ఏజెన్సీ కావాలా? అని అడిగాడని సాయి పల్లవి తెలిపారు. అయితే అలా చేయడం వల్ల తనకు ఎలాంటి ఉపయోగం లేదని సాయి పల్లవి చెప్పింది. తన గురించి తరచూ మాట్లాడుకుంటే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారని సాయి పల్లవి చెప్పింది. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Recent

- Advertisment -spot_img