కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో మాజీ ఎంపీ మధుయాష్కీ భేటీ అయ్యారు. జగిత్యాలలోని ఆయన ఇంటికి వెళ్లి అల్పహరం చేస్తూ మాట్లాడారు. ఇటీవల హత్యకు గురై జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి కుటుంబాన్ని మధుయాష్కీ పరామర్శించారు. కాంగ్రెస్‌లో ఉన్నా, తన అనుచరులకు రక్షణ లేదని ఆరోపించిన జీవన్ రెడ్డి.. మధు యాష్కీతో భేటీ అనంతరం కాస్త కూల్ అయినట్లు కనిపిస్తోంది.