Homeహైదరాబాద్latest Newsహైకోర్టును ఆశ్రయించిన రాజ్ పాకాల.. లంచ్ మోషన్ పటిషిన్..!

హైకోర్టును ఆశ్రయించిన రాజ్ పాకాల.. లంచ్ మోషన్ పటిషిన్..!

తనను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కేటీఆర్ బంధువు రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పటిషిన్ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత విచారిస్తామని జస్టిస్ విజయ్సేన్ రెడ్డి తెలిపారు. కాగా జన్వాడా ఫామ్ హౌస్ లో పార్టీ కేసులో విచారణకు రావాలని పోలీసులు రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేశారు. లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించారు.

Recent

- Advertisment -spot_img