దీపావళి పండుగ వేళ ప్రభుత్వం ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న రెండు డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక డీఏ వచ్చే నెల వేతనంతో.. మరో డీఏ మార్చిలో ఇవ్వాలని నిర్ణయించింది. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.