మహారాష్ట్రలో రుణమాఫీపై సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలేనని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. పాలన గాలికి వదిలేసి మంత్రులు రాష్ట్రాల బాట పట్టారని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ 6 గ్యారంటీలు గ్యారేజ్కు పోయాయి. 40లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అబద్దాలు చెప్పారు. ఇంకా 22లక్షల మందికి రుణమాఫీ జరగాల్సి ఉంది. పూర్తి రుణమాఫీ చేసి తీరాల్సిందే. ఒక్కొక్క రైతుకూలీకి రూ.8 వేలు కాంగ్రెస్ సర్కార్ బాకీ ఉంది’ అని మండిపడ్డారు.