వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా బుధవారం పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పేర్కొన్నారు. 46 మందిని నిందితులుగా ఈ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఏ-1గా భోగమోని సురేశ్ పేరును పేర్కొన్న పోలీసులు. 16 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అధికారులపై దాడి, హత్యాయత్నం కేసుగా నమోదు చేశామని, ఈ నెల 11న జరిగిన ఘటనపై డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాఫ్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.