ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడిగి గ్రామంలో గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాల (వేద వాహిని) ను బుధవారం జిల్లా కలెక్టర్, డీఈఓల ఆదేశాల మేరకు ఎంఈఓ తిరుపతయ్య మూసి వేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో అడ్మిషన్ పొందాలన్నారు. అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట ఎంఆర్సీ ప్రకాష్ ఉన్నారు.