బిగ్బాస్ తెలుగు సీజన్ 8 హౌసులో ఫ్యామిలీ సీజన్ మొదలైంది. ప్రస్తుతం ఈ వారంతా ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. గురువారం విష్ణుప్రియ తండ్రి బిగ్బాస్ హౌసులోకి వచ్చారు. తండ్రిని చూసి విష్ణుప్రియ భావోద్వేగానికి గురైంది. అలాగే ఆట తీరుపై విష్ణుప్రియకి తన తండ్రి పలు సూచనలు చేసారు. పృథ్వీ విషయంలో నీకు బయట చాలా నెగెటివిటీ ఏర్పడుతోంది అని అది నువ్వు దాన్ని గమనించు చెప్పారు. అంతలోనే టేస్టీ తేజ.. “తండ్రిగా మీరు బాధ్యతను నిర్వర్తించాలి ఆమెకు పెళ్లి చేయాలి” అని అన్నాడు. అయితే విష్ణుప్రియ తండ్రి ఇద్దరికీ నచ్చితే పెళ్లి చేస్తాం అన్నట్టు మాట్లాడాడు.. కానీ అంతలోనే ఇది అంత హౌస్ లో గేమ్ వరకు మాత్రమే అని చెప్పాడు. ఆ తర్వాత ఆమెకు నచ్చిన వాడు దొరకాలి కదా.. అంటూ కామెంట్ చేశారు.