రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. పంట పొలాల్లో సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రభుత్వం భావిస్తోంది. మార్చిలోగా 4 వేల మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ‘పీఎం కుసుమ్’ అమలుకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తి అయిన పవర్ వినియోగానికి పోనూ మిగిలిన దాన్ని విక్రయించుకుని రైతులు ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం రైతులు సొంతంగా లేదా ఏదైనా సహకార, స్వయం సహాయక సంఘం లేదా కంపెనీ భాగస్వామ్యంతో పొలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.