Homeహైదరాబాద్latest Newsరాశిఖన్నా లవ్ ఫెయిల్యూర్ స్టోరీ.. అప్పుడు నేను చాలా ఎమోషనల్..!

రాశిఖన్నా లవ్ ఫెయిల్యూర్ స్టోరీ.. అప్పుడు నేను చాలా ఎమోషనల్..!

రాశీఖన్నా తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. రాశిఖన్నా ప్రస్తుతం ‘ది సబర్మతి రిపోర్ట్’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రేపు (నవంబర్ 15) విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్నా రాశి తన జీవితంలో జరిగిన లవ్ ఫెయిల్యూర్ ను ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. ఆమె మాట్లాడుతూ, గతంలో “నేను సాధారణంగా ఎమోషనల్ గా ఉండేదాన్ని. నా జీవితంలో ఒక ప్రేమ కధ ఉండేది, కానీ అది విఫలమైంది. ఆ లవ్ బ్రేకప్ కారణంగా మానసికంగా చాలా కుంగిపోయానని తెలిపింది. కుటుంబం, స్నేహితులు, సినిమాల సహకారంతో నేను కోలుకున్నాను’’ అని రాశీఖన్నా అన్నారు. ఆ తర్వాత నన్ను నేను మార్చుకున్నానుని.. ఇప్పుడు నేను నా కెరీర్ పై దృష్టి పెట్టాను అని రాశిఖన్నా తెలిపింది.

Recent

- Advertisment -spot_img