సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా ఓటీటీలో కూడా సందడి చేసేందుకు రానా వచ్చేస్తున్నాడు. రానా అట్టు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు వేరే హీరో సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేస్తున్నాడు. ‘ది రానా దగ్గుబాటి షో’ పేరుతో రానా హోస్టుగా మన ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ షోకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో రానాతో పాటు రాజమౌళి, గోపాల్ వర్మ, నటీమణులు ప్రియాంక మోహన్, శ్రీ లీల, మీనాక్షి చౌదరి, మాళవిక దగుపతి, నేహా శెట్టి, ప్రగతి శెట్టి, హీరో నాని, దుల్కర్ సల్మాన్, తేజ రిషబ్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.వినోద్ వి తలవాన, సుఖ్వీందర్ సింగ్ చౌహాన్ మరియు శ్రీకాంత్ ప్రబల ఈ షోకి దర్శకత్వం వహించారు.ఈ టాక్ షో ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 23 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.