Homeహైదరాబాద్latest Newsమైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే.. బాంబే హైకోర్టు సంచలన నిర్ణయం

మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే.. బాంబే హైకోర్టు సంచలన నిర్ణయం

మైనర్ భార్య (18 ఏళ్లలోపు) అంగీకారంతోనే భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. వారికీ చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది. తన భార్యపై అత్యాచారం ఫిర్యాదు చేసిన వ్యక్తికి పదేళ్ల శిక్షను సమర్థిస్తూ హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర వార్ధాలో ఓ వ్యక్తి మైనర్ తో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆ బాలిక గర్భం దాల్చింది. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె అతని పై రేప్ కేసు పెట్టింది. వేధింపులు భరించలేక బాలిక 2019లో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో, నేరం జరిగినప్పుడు బాధితురాలి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ అని కోర్టు గుర్తించింది. అయితే 18 ఏళ్లలోపు బాల్యవివాహాలు జరిగినప్పుడు, మైనర్ భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అత్యాచారం కిందకు వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది.

Recent

- Advertisment -spot_img