రుణమాఫీ పై తెలంగాణ రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక అప్డేట్ ఇచ్చారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. అలాగే రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారికి కూడా డిసెంబరు 7లోగా మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. రైతులకు మేలు జరగాలనే ప్రభుత్వం కోరుకుంటుందని ఆయన అన్నారు. అలాగే రైతులు వారి ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు.