హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రజాకవి కాళోజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించి.. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌గౌడ్, సీతక్క, సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.