మహారాష్ట్ర, జార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలవ్వగా.. తొలి రెండు గంటల్లో మహారాష్ట్ర లో 6.61శాతం పోలింగ్ నమోదైంది. అటు జార్ఖండ్లో 12.71శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. నవంబరు 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.