తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్న్యూస్.. వేసవిలో బీర్ల కొరత లేకుండా చూడాలని ఎక్సైజ్ శాఖ బెవరేజెస్ కంపెనీలకు సూచించింది. దీంతో కంపెనీలు భారీగా ఉత్పత్తిని పెంచాయి. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ కంపెనీలో సాధారణంగా నెలకు 3-4లక్షల కేసుల ఉత్పత్తి చేస్తుండగా ప్రస్తుతం దాన్ని 5లక్షలకు పెంచింది. ఇప్పటి నుంచే ఉత్పత్తి పెంచుతూపోతే వేసవిలో సరిపడా స్టాక్ ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి.