అదానితో కాంగ్రెస్,బీజేపీ పార్టీలు అనుబంధం మన దేశానికే అవమానం అని కేటీఆర్ సంచలన ట్విట్ చేసారు. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు..భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు అదాని అని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి అదానితో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అనుబంధం దేశానికి అవమానం మరియు అరిష్టం అని కేటీఆర్ అన్నారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీ లో అదానీ వాటా ఎంతో అని ప్రశ్నించారు. ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు ఇస్తున్నారంటూ ఆరోపించారు. తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి అని కేటీఆర్ డిమాండ్ చేసారు. మీరు అదానీ తో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలి అని నిలదీశారు. తెలంగాణా ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో.. మీ భడే భాయ్ వాటాఎంత?.. మీ అదానీ భాయ్ వాటా ఎంత? ..మీ హైకమాండ్ వాటా ఎంత? అని కేటీఆర్ ప్రశ్నించారు.