Homeహైదరాబాద్latest Newsగౌతమ్ vs పృథ్వి.. బిగ్‌బాస్ హౌసులో పెద్ద గొడవ.. అసలేం జరిగింది.?

గౌతమ్ vs పృథ్వి.. బిగ్‌బాస్ హౌసులో పెద్ద గొడవ.. అసలేం జరిగింది.?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం హోరా హోరీగా సాగుతుంది. తాజాగా ఈ సీజన్ 13వ వారంలోకి అడుగుపెట్టింది.అయితే హౌసులో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో చివరి మెగా చీఫ్‌గా అవడానికి కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నరు. అయితే నిఖిల్, రోహిణి మాత్రం మెగా చీఫ్ కంటెస్టెండర్లుగా మారారు. వీరిలో హౌస్ మెజారిటీ ప్రకారం ఒకరు మాత్రమే ప్రధాన పోటీదారుగా మారే అవకాశం ఉంది. గౌతమ్ మొదటిగా రోహిణికి సపోర్ట్ చేశాడు. నా మాట ప్రకారం రోహిణికి ఇవ్వాలనుకుంటున్నాను.. ఎందుకంటే వైల్డ్ కార్డ్‌లు రాగానే ఎలిమినేట్ చేయాలని చాలా మంది హౌస్‌మేట్స్ చాలా ప్లాన్‌లు వేశారు అని.. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని గౌతమ్ అన్నాడు. దీనిపై పృథ్వీ స్పందిస్తూ.. ప్లానింగ్ లోనే వైల్డ్ కార్డ్స్ పెట్టాలని అనుకున్నాం.. దాన్ని సమర్థించుకోవాలి.. అని పృథ్వీ చెప్పాడు. దీంతో గౌతమ్ vs పృథ్వి మధ్య పెద్ద గొడవ చోటుచేసుకుంది. వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేద్దాం.. పంపించాలి అనుకోవడం చాలా తప్పు.. అని గౌతమ్ అన్నాడు. ఎవరి అభిప్రాయం కరెక్ట్ అయితే వాళ్లు ఉంటారని.. మిగతావాళ్లు హౌస్ బయటికి వెళ్తారని గౌతమ్ అన్నాడు. పృథ్వీని పక్కకు తీసుకోవాలని అవినాష్ ప్రయత్నిచగా వాడికి ఏంటి ఏ స్కోప్ ఇచ్చేది అంటూ పృథ్వీ అన్నాడు. దాంతో గౌతమ్ వాడు వీడేంటి అంటూ ముందుకు వెళ్ళాడు. మేము అందరం మొదటి నుండి బిగ్‌బాస్ హౌసులో ఉంటే … నువ్వు మధ్యలో వచ్చావ్ అంటూ గౌతమ్ కి పృథ్వీ చెప్పాడు. ఏంటి రౌడీయిజం చెయ్యడానికి వచ్చావ్.. నువ్వు ఏం చేయలేవు అని గౌతమ్ అన్నాడు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో గౌతమ్, పృథ్వీ మధ్య పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img