తెలంగాణ ప్రభుత్వం పేదల నిరాశ్రయ సమస్యను తీర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రూ.5 లక్షలను అందించనున్నారు. స్థలం లేని వారికి స్థలంతో పాటు.. ఇంటిని నిర్మించి ఇవ్వనున్నారు. ప్రధానంగా పేదలు గృహసౌకర్యంతో జీవించేందుకు ఈ పథకం ప్రోత్సాహకారిగా ఉంది. ఇళ్లను భూకంప నిరోధకత గల పద్ధతిలో నిర్మిస్తారు. తద్వారా అక్కడ సురక్షిత నివాస వాతావరణం ఉంటుంది. అయితే పథకాన్ని అయితే ప్రారంభించారు కానీ.. విధివిధానాలను రూపొందించలేదు. త్వరలోనే దీనికి సంబంధించి విధివిధానాలను, ఎవరు అర్హులనే వివరాలను వెల్లడించనున్నారు.