ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ,జుక్కల్ నియోజకవర్గం లో ఎమ్మెల్యేలు తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను విస్మరిస్తూ కాంగ్రెస్ పార్టీకి బలహీన పడటానికి కారణం అవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జుక్కల్ ఎమ్మెల్యే పై గాంధీభవన్లో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేయగా. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరి భారాస నాయకులకు, కార్యకర్తలకు పదవులు అంటగడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిరసనకు దిగారు. హైదరాబాద్ గాంధీభవన్ లో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పై జుక్కల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను పట్టించుకోవడంలేదని నియోజకవర్గంలోని ఎనిమిది మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్ లోని గాంధీభవన్ కి వెళ్లి టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను కాకుండా టిఆర్ఎస్, బిజెపి వాళ్లను వెంటేసుకుని తిరుగుతున్నాడని, సీనియర్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలు పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా నుండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన నామినేటెడ్ పదవులు తన అనుకూలమైన వారికి అంట కడుతున్నారని లక్ష్మీకాంతరావుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే లక్ష్మి కాంత్రావు ప్రవర్తన మారకుంటే జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవని కాంగ్రెస్ నాయకులు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులను విస్మరిస్తూ తనకు ఇష్టమొచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ నాయకులు ఆరోపించారు. తక్షణం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై చరలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ చైర్మన్ సౌ దాగర్ అరవింద్, కమల్ సెట్, వినోద్, సంగమేశ్వర, జయ ప్రదీప్, అన్ని మండలాల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.