స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిసాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 422 పాయింట్లు నష్టపోయి 77,155 వద్ద ముగిసింది. నిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయి 23,349 వద్ద నిలిచింది.BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.41%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.41%), హెచ్సిఎల్ టెక్నాలజీస్ (0.87%), టాటా స్టీల్ (0.57%), టిసిఎస్ (0.49%) నిలిచాయి. టాప్ లూజర్స్ గా అదానీ పోర్ట్స్ (-13.53%), NTPC (-2.73%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.64%), ITC (-2.18%), ఏషియన్ పెయింట్స్ (-2.17%) నిలిచాయి.