Homeహైదరాబాద్latest Newsపోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం

ప్రముఖ టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను రాజకీయాలు మాట్లాడను.. తన జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను అని పోసాని కృష్ణమురళి తెలిపారు. ఇన్నేళ్ల జీవితం నేను ఎవరికి తలవంచలేదు.. ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు, నన్ను తిట్టరా.. అవి నేను పట్టించుకోను అని అన్నారు. ఏ పార్టీని అవమానించేందుకే తాను రాజకీయాల్లోకి రాలేదని పోసాని స్పష్టం చేశారు. ఇకపై ఏ పార్టీని పొగడనని, విమర్శించనని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పోసాని పనిచేశారు.

Recent

- Advertisment -spot_img