ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది దివ్యాంగుల సంక్షేమానికి రూ. 50కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. త్వరలో దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామన్నారు. వారి స్వయం ఉపాధి కోసం స్కూటర్లు ఇస్తామని చెప్పారు. ప్రత్యేకంగా జాబ్ పోర్టర్ ను అందుబాటులోకి తెచ్చి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తున్నామని గుర్తుచేశారు.