ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ‘పుష్ప 2’ మూవీ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నేడు ప్రీమియర్స్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సంధ్య 70MMలో పుష్ప-2 ప్రీమియర్‌ను ప్రదర్శిస్తోంది.ఈ ప్రీమియర్ షోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారు.ఈ రోజు రాత్రి 9:30 గంటల షో కు అల్లు అర్జున్ ఈ సినిమాను ఫ్యాన్స్ తో సంధ్య థియేటర్ లో కలిసి చూసేందుకు వస్తున్నాడు.