ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పులి వణికిస్తుంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఉమ్మడి జిల్లాలో పులులు, చిరుతల సంచారం ఎక్కువైంది. ఐదు రోజుల క్రితం ఓ మహిళ పులి దాడిలో చనిపోగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. పులులు దాడులు చేస్తుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ చిరుత పులి ఫ్లై ఓవర్పై గాండ్రిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన వాహనదారులు పులి భయంతో హడలిపోతున్నారు.