వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితి వీడటం లేదు. దాయాది దేశంలో పర్యటించేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. మరోవైపు పీసీబీ స్పష్టమైన వైఖరిని అధికారికంగా తెలియజేయకపోవడంతో షెడ్యూల్ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ తన మొండి వైఖరిని అలాగే కొనసాగించి.. ఛాంపియన్స్ ట్రోఫీని బహిష్కరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని పలువురు హెచ్చరిస్తున్నారు.