ఒకే దేశం – ఒకే ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గంలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆ తర్వాత సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టబోతున్నారని అంతా భావించారు. అయితే అంతలోనే కేంద్రం వెనక్కి తగ్గింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులు సోమవారం లోక్‌సభలో బిజినెస్ ఎజెండా నుండి తొలగించబడ్డాయి. దీంతో ఈ బిల్లులు చట్టసభల ముందుకు రావడంపై సందిగ్ధత నెలకొంది.