బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగిసింది. ఈ సీజన్ టైటిల్ ఎవరు అందుకుంటారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ప్రతి సంవత్సరం ఒక ముఖ్య అతిథి బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌ను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం బిగ్‌బాస్ ఫైనల్ జరగనుంది. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఈరోజు మా టీవీ ఛానెల్స్‌లో ప్రసారం అవుతోంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ రాబోతున్నారు అని అఫీషియల్ గా ప్రకటించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఇందిరా నగర్, కృష్ణా నగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.