Homeహైదరాబాద్latest Newsఒక్క ప్లేట్ భోజనం 32 వేలు.. వేములవాడ రాజన్నకే రేవంత్ శఠగోపం..!

ఒక్క ప్లేట్ భోజనం 32 వేలు.. వేములవాడ రాజన్నకే రేవంత్ శఠగోపం..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు, ఇతర వీపీఐల భోజనాలకి రూ.32 లక్షలు ఖర్చుయింది. వేములవాడలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుయ్యారు, పలువురు మంత్రులకు ఇతర వీఐపీలకు 100 మందికి తాజ్‌కృష్ణ నుండి తెప్పించి భోజనాలు పెట్టారు. అయితే ఒక్కో పట్టు పంచెకు అధికారులు పదివేలు ఖర్చు చేసారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్లేటు భోజనం ధర రూ.32 వేలు… సీఎంతో సహా వంద మందికి భోజనాలకి రూ.32 లక్షలు ఖర్చుయింది. ఈ భోజన బిల్లు రూ.32 లక్షలు కట్టాలని వేములవాడ రాజన్న ఆలయ అధికారులకు తాజ్‌కృష్ణ నిర్వాహకులు బిల్లు పంపించారు. అయితే భోజన బిల్లు కాకుండా ఇతర ఖర్చులు మొత్తం కలిపి రూ.1 కోటి 70 లక్షలు ఖర్చు అయినట్టు తెలుస్తోంది. దీంతో ఇంత మొత్తం కట్టలేమన్న రాజన్న ఆలయ అధికారులు తెలిపారు. అయినా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఈ ‘చెల్లింపు’పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో లయ అధికారులు బిల్లు ఫైలును సిరిసిల్ల కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే నిత్యం కడుపు కాల్చుకొని, ప్రతి పైసా ఆదా చేస్తున్నానని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఖర్చుపై ఎలా స్పందిస్తారో చూడాలి. దీంతో రాష్ట్రంలోని ప్రజలు అంత రేవంత్ రెడ్డి ఏకంగా వేములవాడ రాజన్నకే శఠగోపం పెట్టాడు అని అంటున్నారు.

Recent

- Advertisment -spot_img