బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ గత కొన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తునాడు. ఒక వైపు తెలుగు హీరోలు ఇండియా మొత్తం సత్తా చాటుతుంటే… బాలీవుడ్ హీరోలు మాత్రం ప్లాప్ సినిమాలతో సతమతం అవుతున్నారు. అయితే ఈ క్రమంలో స్టార్ హీరో అమిర్ ఖాన్ అలాగైనా ఒక హిట్ కొట్టాలని ఒక తెలుగు డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు. అది కూడా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లో బ్యానర్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తునట్టు తెలుస్తుంది. అయితే వంశీ పైడిపల్లి ఇప్పటికే అమీర్‌ఖాన్‌కి కథ చెప్పగా, సినిమా లైన్ విని అమీర్‌ఖాన్ కూడా ఒక చెప్పాడు అని తెలుస్తుంది.ఈ సినిమాని దిల్‌రాజ్ పాన్ ఇండియా మూవీగా రూపొందించడానికి 300 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కూడా సిద్ధం చేశాడు. మరి ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సివుంది ఉంది.