పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 18 ఏళ్ల తర్వాత పండుగ నారాయణరెడ్డి, రేఖమయ్య, బజన రంగనాయకులు, వడ్డే కొండ, ఓబిరెడ్డిలకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వీరంతా గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 2005 జనవరి 24న అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ నేత పరిటాల రవిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది.