మెగా హీరో రామ్‌చరణ్, నందమూరి ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2022లో విడుదలై భారీ కలెక్షన్స్ రాబెటింది. అలాగే ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఈ సినిమాపై కొత్త డాక్యుమెంటరీని చిత్రబృందం ప్రకటించారు.ఈ డాక్యుమెంటరీకి ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ అనే టైటిల్‌తో ఈ డాక్యుమెంటరీ రాబోతుంది. ఈ డాక్యుమెంటరీ ని రాజమౌళి థియేటర్లో విడుదల చేయనున్నారు. 1 గంట 38 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీని డిసెంబరు 20న కేవలం ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల చేయనున్నారు. మల్టీప్లెక్స్ స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉంటే దీనికి సంబంధించిన టిక్కెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ షోకి సంబంధించిన టిక్కెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి.