Homeఫ్లాష్ ఫ్లాష్మందు కొట్టేటప్పుడు ఇవి తినొద్దు.. #Drinking

మందు కొట్టేటప్పుడు ఇవి తినొద్దు.. #Drinking

మందు కొట్టేటప్పుడు ఇష్టమున్న స్టప్ తినేందుకు ఆసక్తి చూపుతుంటారు కొందరు.

మరికొందరేమో కారంగా ఉండే తొక్కు, కారం చిప్స్ తింటుంటారు. మరికొందరు ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు పండ్లు తినడానికి ఆసక్తిగా ఉంటారు.

ఐతే మందు తాగేటపుడు తీసుకోకూడని పదార్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

పాల పదార్థాలు

మందులో పాలు కలుపుకుని తాగడం అస్సలు మంచి పద్దతి కాదు.

మందులో పాలు కలుపుకోవడమ్ పక్కన పెడితే పాల పదార్థాలు మంచింగ్ కి తినకూడదు.

కొందరికి తాగే సమయంలో జున్ను తినే అలవాటు ఉంటుంది. ఇలా తింటే జీర్ణక్రియ దెబ్బతిని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

నూనెలో వేయించిన పదార్థాలు

మిర్చి బజ్జీ, చిప్స్ వంటి పదార్థాలని మంచింగ్ గా తినకూడదు. వీటిల్లో గ్యాస్ ఎక్కువగా ఉంటుంది.

దానివల్ల దాహం ఎక్కువ వేస్తుంది. అందువల్ల మద్యం తాగేటపుడు నూనెలో వేయించిన పదార్థాలకి ఫుల్ స్టాప్ పెట్టండి.

జీడిపప్పు

చాలా మంది మద్యానికి మంచింగ్ లోకి జీడిపప్పు మంచిదని అనుకుంటారు. ఇది కూడా సినిమాల్లో చూపించిందే.

కానీ అది ఎంతమాత్రం కాదు.
జీడిప్పప్పులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది.

కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న ఏ పదార్థాలని తీసుకున్నా ఆరోగ్యానికి హాని చేస్తాయి.

వీటివల్ల గుండెకి సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img