Homeఫ్లాష్ ఫ్లాష్జీవిత బీమా పాలసీపై బోనస్.. కేంద్రం ప్రకటన

జీవిత బీమా పాలసీపై బోనస్.. కేంద్రం ప్రకటన

Holders of Post Office Life Insurance policies will receive a bonus. The government has announced a bonus for Post Office Life Insurance (PLI) for the financial year 2021-22.

పోస్టాఫీస్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలను కలిగి ఉన్నవారికి బోనస్ లభించనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వం పోస్టాఫీస్ లైఫ్ ఇన్సురెన్స్(పీఎల్ఐ)కు బోనస్ వర్తించేలా ప్రభుత్వం ప్రకటించింది.

2021 ఏప్రిల్ 1 నుంచి ఈ బోనస్ అమలులోకి వస్తుంది. పోస్టాఫీసులో ప్రస్తుతం ఆరు జీవిత భీమా పాలసీలు ఉన్నాయి.

అవి హోల్ లైఫ్ అస్యూరెన్స్(సురక్షా), ఎండోమెంట్ అస్యూరెన్స్ (సంతోష్), కన్వర్టిబుల్ హోల్ లైఫ్ అస్యూరెన్స్ (సువిధా), యాంటిస్పేటెడ్ అస్యూరెన్స్(సుమంగల్), జాయింట్ లైఫ్ అస్యూరెన్స్ (యుగల్ సురక్ష), చిల్డ్రన్ పాలసీ (బాల్ జీవన్ బీమా) లాంటి భీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి.

పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ రూల్స్ (2011) ప్రకారం.. 2020 మార్చి 31 నాటికి పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ ఆస్తులు అప్పుల వ్యాల్యూయేషన్ ఆధారంగా రివర్షనరీ బోనస్ ని నిర్ణయించారు.

అయితే ఈ బోనస్ ఆకస్మిక మరణం తర్వాత లేదా పాలసీ కాలపరిమితి గడిచిన తర్వాత చెల్లిస్తారు.

హోల్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ(డబ్ల్యూఎల్ఏ)పై వెయ్యికి రూ.76, ఎండోమెంట్ అస్యూరెన్స్(జాయింట్ లైఫ్ & చిల్డ్రన్ పాలసీలతో సహా) పాలసీపై వెయ్యికి రూ.52లు అదనంగా లభిస్తుంది.

యాంటిస్పేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్(సుమంగల్) పాలసీపై వెయ్యికి రూ.48, కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీలు(సీడబ్ల్యూఏ)పై వోల్ లైఫ్ బోనస్ రేటు వర్తిస్తుంది.

Recent

- Advertisment -spot_img