Homeఅంతర్జాతీయంఅమెరికా జర్నలిస్ట్ హత్య వెనుక సౌదీ యువరాజు పాత్ర

అమెరికా జర్నలిస్ట్ హత్య వెనుక సౌదీ యువరాజు పాత్ర

It is rumored that Saudi Prince Mohammed bin Salman was behind the assassination of Washington Post journalist Jamal Khashoggi, who created a sensation two and a half years ago.

Recently, a US intelligence report also said that a Saudi prince was involved in Khashoggi’s assassination.

Authorities say Khashoggi was killed on the instructions of Salman Bin. Information that the report will be released on Friday.

రెండున్నరేళ్ల కిందట సంచలనం సృష్టించిన వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్య వెనుక సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పాత్ర ఉందంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

తాజాగా, అమెరికా నిఘా నివేదిక సైతం ఖషోగి హత్యలో సౌదీ యువరాజు హస్తం ఉందని అంటోంది.

సల్మాన్ బిన్ సూచనల మేరకే ఖషోగిని హత్య చేశారని నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఆ నివేదికను శుక్రవారం విడుదల చేయనున్నట్టు సమాచారం.

అక్టోబరు 2018లో జరిగిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్యోదంతం అమెరికా, సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యింది.

ఈ హత్యకు అసలు కారణం ఎవరా? అని దర్యాప్తు చేసిన సీఐఏ, చివరకు సౌదీ యువరాజును అసలు కారకుడిగా తేల్చినట్లుగా అమెరికా మీడియా చాలా కాలం నుంచి కోడైకూస్తోంది.

ఇటువంటి హత్య చెయ్యాలంటే, కచ్చితంగా రాజు అనుమతి తప్పనిసరి అని అమెరికా అధికారులు నమ్ముతున్నారు.

టర్కీలోని ఇస్తాంబుల్‌లో సౌదీ కాన్సులేట్ వద్ద ఖషోగిని హత్య చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), ఇతర నిఘా సంస్థల సమాచారం ఆధారంగా ఈ నివేదికను తయారు చేసినట్టు చెబుతున్నారు.

హత్యలో సౌదీ యువరాజు సల్మాన్ పాత్ర ఎంతమేరకుంది? ఆయన ఎలా సహకరించారు? వంటి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

అయితే, ఈ నివేదికపై స్పందించేందుకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ నిరాకరించారు.

హంతకులను శిక్షించేందుకు వేరే మార్గాల్లో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సౌదీకి ఆయుధ విక్రయాలపై నిషేధం, ఆంక్షలు విధించడం వంటి చర్యలపై సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిపారు.

జవాబుదారీతనానికి పారదర్శకతే ముఖ్యమని, అయితే, హంతకులకు అది లేదని తాను అనుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుత నివేదిక విడుదల కాకుండా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.

కాగా, హత్యోదంతంపై అప్పట్లో ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సౌదీ యువరాజు సల్మాన్ పాత్రపై ఆరోపణలు గుప్పించాయి.

అయితే, వీటిని తోసిపుచ్చిన సల్మాన్.. హత్యతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు.

అయితే, దేశ యువరాజుగా ఖషోగి హత్యకు బాధ్యత వహిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం హత్య కేసులో అరెస్టైన నిందితులపై విచారణ జరుగుతోంది.

అటు, నివేదిక విడుదలకు ముందే గురువారం సౌదీ యువరాజు సల్మాన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి మాట్లాడారు.

ప్రాంతీయ భద్రత, యెమెన్‌లో యుద్ధాన్ని ఆపడంలో ప్రయత్నాలు, మానవ హక్కులు, శాంతి భద్రతలు కాపాడడం వంటి విషయాలపై చర్చించారు.

ఇదిలా ఉండగా, ఖషోగ్గీ హత్యతో సౌదీ యువరాజు సల్మాన్‌కు సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి.

అలాగే, సౌదీ యువరాజుకు ఈ హత్యతో సంబంధం లేదని, ట్రంప్ అల్లుడు జరేడ్ కుష్నర్‌తో సల్మాన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని నాటి విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు.

Recent

- Advertisment -spot_img