Homeజాతీయంవంట గ్యాస్‌ సిలిండర్‌ ధరపై మరోసారి పెంపు

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరపై మరోసారి పెంపు

Uncontrollably rising cooking gas prices are paying off for the common man. Recently, the price of a cooking gas cylinder has been increased by Rs 25. The companies announced that these prices would take effect immediately. With the latest hike, the price of a 14.2 kg domestic cylinder in Delhi has gone up to Rs 819. Also, the price of 19 kg commercial LPG cylinders has gone up by another Rs 95. With this, the price of a commercial cylinder reached Rs. 1614.

అదుపులేకుండా పెరుగుతున్న వంట గ్యాస్‌ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. తాజాగా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరపై రూ.25 పెంచారు. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. తాజాపెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌ ధర రూ.819కు పెరిగింది. అలాగే 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధర మరో రూ .95 పెరిగింది. దీంతో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1614కు చేరింది.  దీంతో ఒక్క నెలరోజుల వ్యవధిలోనే సిలిండర్‌ ధర  రూ.100లకు పైగా భారం కావడం గమనార్హం.

హైదరాబాదులో ఇప్పటిదాకా రూ.846.50గా  ఉన్న సిలిండర్ ధర ప్రస్తుత బాదుడుతో రూ.871.50కి చేరింది. బెంగళూరులో రూ.823, చెన్నైలో రూ.835, ముంబైలో రూ.819, కోల్‌కతాలో రూ.845కి చేరింది. ఈ నెల 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా 15న తేదీన మరో రూ.50 వడ్డించాయి. చివరగా  గత నెల 25న కూడా 25 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు  మండుతున్న పెట్రోలు డీజిల​ ధరలు వాహనదారులకు చుక్కలు  చూపిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img