వనపర్తి లోని తన నివాసంలో 421 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేసి వారితో కలిసి కళ్యాణవిందు (సహపంక్తి) భోజనం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇది సంక్షేమ రాష్ట్రం అని అన్నారు..
మంత్రి సందేశం ఆయన మాటల్లో..
- పేదింటి ఆడబిడ్డలకు అండ కళ్యాణలక్ష్మి
- అందరూ బాగుండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష
- కరోనాతో ప్రపంచం స్థంభించినా తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆగలేదు
- కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమయింది
- దేశంలో ఎక్కడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లు సంక్షేమ పథకాలు లేవు
- సామాన్య ప్రజల అవసరాల పట్ల అవగాహన ఉంటేనే ఇలాంటి పథకాల అమలు సాధ్యమవుతుంది.
- తెలంగాణ ఉద్యమంలో 14 ఏండ్లు ప్రజల కష్టాలను దగ్గరుండి చూశాం కాబట్టే దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రూపుదిద్దుకున్నాయి.
- ప్రజల ఆశీర్వాదమే తెలంగాణ ప్రభుత్వానికి బలం, బలగం