ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వరుస విజయాలతో అదరగొడుతున్న టీమిండియా మరో ఆసక్తికరమైన పోరుకు సిద్ధమైంది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ ఎలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా రేపు దుబాయ్‌లో జరగనున్న తొలి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా మ్యాచ్‌కి దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో పరుగు తీస్తుండగా బంతి తగిలి అతని భుజానికి గాయమైంది. దీంతో బౌలింగ్ సమయంలో షమీ 4 ఓవర్లు మాత్రమే చేశాడు. బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు లేవు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంటారు. అయితే అదనపు పేసర్ అవసరమైతే కుల్దీప్ యాదవ్ ను ప్లేయింగ్ 11 నుంచి తీసే అవకాశం ఉంది.
టీమిండియా ప్లేయింగ్ XI (అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్(కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా/అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ.