Homeహైదరాబాద్latest NewsChampions trophy 2025: కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఆల్‌‌టైమ్ రికార్డ్.. చరిత్రలో ఒకే ఒక్కడు..!

Champions trophy 2025: కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఆల్‌‌టైమ్ రికార్డ్.. చరిత్రలో ఒకే ఒక్కడు..!

Champions trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆల్‌‌టైమ్ రికార్డ్ సాధించాడు. నాలుగు ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరుకున్న ఏకైక కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. దీనితో రోహిత్ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా మరే ఇతర ఆటగాడు నాలుగు ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరుకోలేదు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియాను ఆసీస్ ఓడించింది. అలాగే 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో కూడా టీమిండియాను ఆసీస్ ఓడించింది. గత సంవత్సరం రోహిత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా 2024 T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. హిట్ మ్యాన్ కెప్టెన్సీలో జట్టు ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. దానితో నాలుగు ICC టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరిన కెప్టెన్‌గా రోహిత్ అరుదైన ఘనతను సాధించాడు. అయితే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా మూడు ఐసీసీ టైటిళ్లను గెలుచుకున్నాడు. అయితే అతని పదవీకాలంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ జరగలేదు. దీనితో కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర రికార్డు సృష్టించాడు.

Recent

- Advertisment -spot_img