Champions Trophy final 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ 2025 కు రంగం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫైనల్ లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో భారత్ కు గట్టి సవాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే సెమీస్‌లో విజేతగా నిలిచాం, ఇక ఫైనల్‌లో ఏమైనా జరగొచ్చని కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపారు. ‘భారత్ అద్భుతమైన జట్టు, బాగా ఆడుతోంది. గత మ్యాచ్ నుంచి నేర్చుకొన్నాం. ఈ సారి విజయం కోసం తీవ్రంగా యత్నిస్తాం’ అని కేన్ చెప్పుకొచ్చారు.