Homeతెలంగాణకాళేశ్వరం నీటిని విడుదల చేసిన సీఎం కేసిఆర్

కాళేశ్వరం నీటిని విడుదల చేసిన సీఎం కేసిఆర్

గజ్వెల్ నియోజకవర్గంలోని అవుసులోని పల్లి వద్ద సంగారెడ్డి కాలువ ఆఫ్ టెక్ తూము ద్వారా హల్దీ వాగుకు కాళేశ్వరం నీటిని ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు.

ఈ కాలువ ద్వారా గజ్వెల్, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది.

ఇక్కడి నుంచి 98 కి.మీ. దూరంలో ఉన్న నిజాంసాగర్‌కు గోదావరి జలాలు చేరుకోనున్నాయి.

కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్‌ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు.

హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేశారు. అనంత‌రం మర్కూక్‌ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్‌ కాల్వలోకి విడుదల చేశారు.

నీటి విడుద‌ల సంద‌ర్భంగా గోదావ‌రి జ‌లాల‌కు సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

కార్య‌క్ర‌మంలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హ‌రీష్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డితో పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

కాళేశ్వరం నీటిని విడుదల చేసిన సీఎం కేసిఆర్

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఎన్వీ రమణ

అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు

అన్నమోదిక్కు… ఆకలోదిక్కు…!!

క్లాక్ ట‌వ‌ర్ల చ‌రిత్ర తెలుసా.. వీటి వెనుక స్వార్థం ఏంటి..

Recent

- Advertisment -spot_img