Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ”పుష్ప 2” సినిమా వంటి భారీ హిట్టు తరువాత చేయబోయే సినిమాపై అంచనాలు భారిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాలను త్రివిక్రమ్, అట్లీ లతో చేయబోతున్నాడు. త్రివిక్రమ్ తో సినిమా మైథాలజీ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మరోవైపు అట్లీ తో చేయబోయే సినిమాలో అల్లు అర్జున్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే పుష్ప సినిమాకి దాదాపు 5 ఏళ్ళు పట్టడంతో ఇకపై వెంటా వెంటానే సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ రెండు సినిమా కధలు వేరు వేరు కాబట్టి ఒకసారి షూటింగ్ ఎలా చేస్తారు అని సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తరం హీరోల్లో ప్రభాస్ మాత్రమే ఒకసారి రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా అదే తరహాలో ఇకముందు సినిమాలు తీయాలని చూస్తున్నాడు. అందుకే ఒకేసారి ఈ సినిమా షూటింగ్ లను మొదలు పెట్టబోతున్నాడు.