Homeలైఫ్‌స్టైల్‌పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా

పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా

‘పద్దెనిమిదేళ్లు దాటినవారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ మొదలవుతుంది.

వ్యాక్సీన్ కోసం నమోదు చేసుకోవడానికి ముందు మీ నెలసరి తేదీలను ఒక సారి చూసుకోండి.

నెలసరికి అయిదు రోజుల ముందు అయిదు రోజుల తర్వాత వ్యాక్సీన్ తీసుకోవద్దు. నెలసరి సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.

మొదటి డోసు తీసుకున్న తర్వాత రోగ నిరోధక శక్తి తగ్గిపోయి నెమ్మదిగా పెరుగుతుంది.

నెలసరి సమయంలో వ్యాక్సీన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అందుకే నెలసరి సమయంలో వ్యాక్సీన్ తీసుకోవద్దు” అంటూ ఓ సందేశం వాట్సాప్‌లో షేర్ అవుతోంది.

పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోకూడదంటూ అనుమానాలకు దారి తీసేలా ఆ సందేశం ఉంది.

ఈ వ్యాక్సీన్ నెలసరి సమయంలో తీసుకోవడం వల్ల శరీరం పై ఏమైనా ప్రభావం ఉంటుందా? నెలసరి సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందా?

ఇలాంటి అనుమానాల నివృత్తికి ‘బీబీసీ మరాఠీ’ నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ గాయత్రి దేశ్ పాండేతో మాట్లాడింది.

“నెలసరి ఒక సహజ ప్రక్రియ. వ్యాక్సీన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అందరికీ ఇంటి నుంచి పని చేసే అవకాశం లేకపోవచ్చు.

కొందరు రోజూ ఆఫీస్‌కి వెళ్తుంటారు. కొందరు అత్యవసర విభాగాలలో పని చేస్తూ ఉంటారు.

వారి నెలసరి ఎప్పుడైనా కావచ్చు. వారు వ్యాక్సీన్ కోసం నమోదు చేసుకుంటే ఎప్పుడైనా వెళ్లి వ్యాక్సీన్ తీసుకోవచ్చు” అని డాక్టర్ గాయత్రి చెప్పారు.

వ్యాక్సీన్ వల్ల శరీరానికి ఏమీ హాని కలగదని ఆమె స్పష్టం చేశారు.

భారత ప్రభుత్వం ఏం చెబుతోంది?

వ్యాక్సీన్ వల్ల నెలసరి ప్రభావితమవుతుందనే సమాచారం వైరల్ కావడంతో ఆ వాదనను ఖండిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనను విడుదల చేసింది.

నెలసరికి అయిదు రోజుల ముందు, తర్వాత వ్యాక్సీన్ తీసుకోకూడదని వస్తున్న సందేశం తప్పు అని ప్రకటనలో పేర్కొంది.

18 ఏళ్లు దాటిన వారి కోసం కోవిన్ వెబ్ సైటులో, యాప్‌లో ఏప్రిల్ 28 నుంచి నమోదు చేసుకోవచ్చు అని చెబుతూ వదంతులను నమ్మొద్దని చెప్పింది.

మరోవైపు నీతిఅయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ కూడా దీనిపై స్పందించారు.

పీరియడ్స్‌లో ఉన్న మహిళలు కూడా నిరభ్యంతరంగా టీకా వేసుకోవచ్చని.. ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img