కరోనా సోకి దవాఖానలలో చికిత్స పొందుతున్న తమ బంధువుల క్షేమ సమాచారాలు తెలియక క్షోభ పడుతున్నవారికి ఎయిర్‌టెల్ శుభవార్త చెప్పింది.
రోగులతో ‘కనెక్ట్ కావడానికి’ రూ. 49 రీచార్జి ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించింది.
తక్కువ ఆదాయం కలిగి ఉన్న ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఇది వర్తించనుంది.
సుమారు 5.5 కోట్ల మంది ఖాతాదారులు లబ్ధి పొందనున్నారు.
కాగా ప్రస్తుతం రూ. 49 రీచార్జితో రూ. 38 టాక్‌టైం, 100 ఎంబీ డేటా 28 రోజుల కాలపరిమితితో ఉంది.
అంతేగాక రూ. 79 రీచార్జి ప్యాక్‌తో ‘డబుల్ బెనిఫిట్స్’ పొందేలా రీచార్జి కూపన్‌ను అందించనుంది.